జనవరి 30, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయనున్నారు.యూఎఫ్‌బీయూ 2 రోజుల పాటు సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ఏఐబీఈఏ వెల్లడించింది. గురువారం ముంబైలో జరిగిన యూఎఫ్‌బీయూ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 5 రోజుల పనిదినాలు, పింఛను నవీకరణ, ఎన్పీఎస్ రద్దు, వేతన సవరణ డిమాండ్లు, చార్టర్‌పై తక్షణ చర్చలు తదితర డిమాండ్లతో సమ్మెకు దిగనున్నారు.