ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. రైతు భరోసా కేంద్రాల్లో 4,765 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతు భరోసా కేంద్రాల్లో 1,644 ఉద్యాన, 467 వ్యవసాయ, 63 మత్స్య, 22 పట్టు సహాయక పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన శాఖ నుండి అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.