జీవో నెంబర్ 1ను హైకోర్టు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ సీపీఐ నాయకులు పేర్కొన్నారు. గురువారం రాత్రి అనంతపురం క్లాక్ టవర్ వద్ద ఆ పార్టీ నాయకులు హైకోర్టు ఆదేశాలపై హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ ఈనెల 20వ తేదీ వరకూ జీవో నెంబర్ 1న సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం తీపి కబురన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు రోడ్ షోలు, ర్యాలీ లు, సభలు పెట్టకూడదంటూ వైఎస్ జగన చీకటి జీవోను తీసుకొచ్చారన్నా రు. దీనిపై రాష్ట్ర ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందన్నారు. ఈ జీవో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. హైకోర్టు తీర్పుతోనైనా ఆయన తక్షణమే జీవోను ఉపసంహరించుకో వాలన్నారు. లేకుంటే ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు నారాయణస్వామి, మల్లికార్జున, రాజారెడ్డి, శ్రీరాములు పాల్గొన్నారు.