ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న నియంత జగన్ పతనం ఖాయమని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. గురువారం కర్నూల్ జిల్లా, గోనెగండ్ల మండలంలోని వీరంపల్లి, తిప్ప నూరు, వేముగోడు, గ్రామాల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యాక్రమాన్ని నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయా గ్రామంలో టీడీపీ జెండాను ఎగర వేశారు. గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. టీడీపీ నాయ కులు మండల కన్వీనర్ నజీర్సాహెబ్, తిరుపతయ్యనాయుడు, వీరంపల్లి స్వామి, గోపిగౌడ్, గౌడ్, షాషావలి, నూరహమ్మద్, ఎర్రబాడు శ్రీనివాసులు, కులమాల రాముడు, చాంద్బాషా, రంగస్వామినాయుడు పాల్గొన్నారు.