మానసిక, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని రాష్ట్ర వ్యవ సాయ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. స్థానిక ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో గురువారం ఆయన ఎస్‌ఆర్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... పండుగల్లో యువతను ఒకదగ్గరకు చేర్చి, వారికి ఆనందం ఇచ్చేలా టోర్నమెంటు ఏర్పాటు చేసిన మాచిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డిని అభినందిస్తున్నామన్నారు. ప్రతి క్రీడాకారుడు గెలుపు ఓటములను సాధారణంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో శ్రీసేవానాదం ట్రస్టు వ్యవస్థాపకుడు శ్రీనాథ్‌రెడ్డి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రూస ప్రాజెక్ట్సు సీఈవో రాయల్ వంశీకృష్ణ, కోడూరు కల్పలత, ట్రస్టు సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.