వైసీపీ నేత , మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు రంగం సిద్థమైంది. ఈ సందర్భంగా శుక్రవారం శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో ఈ నెల 18వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వైసీపీలో ఉన్న కాండ్రు కొంత కాలంగా ఆపార్టీకి దూరంగా ఉంటున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నప్పటికీ సరైన గుర్తింపు, సముచిత స్థానం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్ర అభివృద్థి టీడీపీ కే సాధ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు.