నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం చాకలి వీధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇంటి యజమాని ఓబులేసును ఓ వ్యక్తి హత్య చేశాడు. రాజశేఖర్ అనే వ్యక్తి మద్యం సేవించి ఇంటికి వచ్చి పెద్దగా కేకలు వేస్తుండడంతో ఎందుకు అలా అరుస్తున్నావని ఇంటి ఓనర్ అన్నందుకు.. అతనితో ఘర్షణకు దిగి.. దాడి చేసి హత్య చేశాడు. అయిదు నెలల క్రితం ఓబులేసు ఇంట్లో రాజశేఖర్ అద్దెకు దిగాడు. అతని వేధింపులు తాళలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మద్యానికి బానిసైన రాజశేఖర్ ప్రతి రోజు తాగి అరుస్తుండడంతో ఇంటి యజమాని ఓబులేసు అడిగినందుకు దాడి చేసి అతి కిరాతకంగా కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.