కోడి కత్తి శ్రీనివాస్ కేసు లో ఎన్ఐఏ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కోర్టుకు రావాల్సిందేనని కోర్టు టేప్ రికార్డర్గా ఉండదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో బాధితుడిని నేటి వరకూ ఎందుకు విచారించలేదని నిందితుడి తరపు న్యాయవాది సలీమ్ ప్రశ్నించారు. సమాధానంగా స్టేట్మెంట్ రికార్డు చేశామని ఎన్ఐఏ న్యాయవాది చెప్పారు. రికార్డు చేస్తే చార్జ్‌షీట్‌లో ఎందుకు లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. బాధితుడిని విచారించకుండా మిగతా సాక్షులను.. విచారించి ఉపయోగం ఏముందని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితుడిగా ఉన్న సీఎం కోర్టుకు రావాల్సిందేనని జడ్జి స్పష్టం చేశారు. 56 మందిని ఈ కేసులో విచారిస్తే 1 నుంచి 12 వరకూ ఉన్నవారి స్టేట్మెంట్లు.. చార్జ్‌షీట్‌లో ఎందుకు లేవని ఎన్ఐఏ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ఈనెల 31వ తేదీ నుంచి విచారణకు న్యాయస్థానం షెడ్యూల్ ప్రకటించింది. కోర్టుకు బాధితుడు సహా మిగతా వారంతా తప్పనిసరిగా హాజరుకావాలని జడ్డి స్పష్టం చేశారు. కాగా కోడి కత్తి కేసులో శ్రీనివాస్‌కు ఎన్ఐఏ కోర్టు బెయిల్ నిరాకరించింది.