తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో తమిళ భాషా పేపర్ ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ చట్టాన్ని సవరించింది. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. 2021 డిసెంబర్ 1 నుంచి ఉద్యోగాలకు ఇది వర్తిస్తుందని.. తమిళ యువతకు ప్రభుత్వ శాఖల్లో 100 శాతం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.