ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో 144 సెక్షన్‌ను ఈ నెల 22 వరకు పొడిగించారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పట్టణ సీఐ బాలకృష్ణ తెలిపారు. గత నెల 16న అల్లర్ల నేపథ్యంలో విధించిన 144 సెక్షన్ ను పూర్తిగా అమలు చేస్తున్నామన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, బహిరంగ సభలు నిర్వహించరాదని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు.