రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో కొంతమంది రాజస్థాన్ శాసనసభ్యుల ప్రమేయం ఉందని భారతీయ జనతా పార్టీ ఎంపీ కిరోడి లాల్ మీనా శుక్రవారం ఆరోపించారు.ఈ కేసుపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ.. జనవరి 19న వేలాది మంది మద్దతుదారులతో కలిసి దౌసా నుంచి జైపూర్ వరకు నిరసన ప్రదర్శన చేస్తానని మీనా తెలిపారు.పేపర్ లీక్ కేసులో ఆరుగురు రాజస్థాన్ శాసనసభ్యుల ప్రమేయం ఉందని ఆయన అన్నారు.సీనియర్ టీచర్ పేపర్ లీక్ కేసులో పరారీలో ఉన్న నిందితుడు ఢాకా ఆన్‌లైన్ పరీక్షల సూత్రధారి అని, సురేష్ ఢాకాకు అన్ని ఐటీ ల్యాబ్‌లతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఎంపీ ఆరోపించారు. మహేంద్ర బిష్ణోయ్ గుర్గావ్ నుంచి శిక్షణ తీసుకున్న ఐటీ నిపుణుడు అని తెలిపారు.