జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పులివెందుల పట్టణంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన హౌసింగ్ అధికారులు, సిబ్బందికి ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాలనీలో మౌలిక వసతుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిర్దేశించిన సమయంలో ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. కాలనీలో నీటి సరఫరా పైపులైన్ పనులు, యూజీడీ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం మున్సిపల్ డీఈ గుర్రప్పయాదవ్, హౌసింగ్ డీ హౌసింగ్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు.