ముంచంగిపుట్టు మండలంలోని సుజనకోట గ్రామంలో స్థానిక గిరిజనుడు గాసిరాం దొర ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవో నెం-1ని రద్దు చేయాలని జిఓ కాపీలను భోగిమంటల్లో గ్రామస్తులు శనివారం తెల్లవారుజామున తగలబెడుతూ. నిరసనలు తెలియజేశారు. అనంతరం గ్రామస్తుడు గాసిరాం దొర మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ నెం-1 రాజ్యంగ విరుద్ధంగా ఉందని ప్రజలకు ఉన్న స్వేచ్ఛ ఏమైనా సమస్యలు ఎదురైనప్పుడు నిరసనలు ధర్నాలు ర్యాలీలు ఆందోళన చేసే హక్కు దేశంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించినా హక్కు అని అటువంటి హక్కును కాల రాస్తే ఊరుకోమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఆదినారాయణ ప్రసాద్ పడాల్ గోపాలరావు దామోదరం పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు.