అమెరికాలో మరో భారత సంతతి మహిళకు అత్యున్నత పదవి లభించింది. డెమోక్రాట్ పార్టీ తరఫున కన్సాస్ రాష్ట్ర సెనేటర్ గా ఉషారెడ్డి (57) శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈమె 2013 నుంచి మన్ హాటన్ సిటీ కమిషన్ కు సేవలందిస్తున్నారు. మేయర్ గా రెండు సార్లు ఎన్నికయ్యారు. నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ చాప్టర్ ప్రెసిడెంట్ గానూ పని చేశారు. కాగా, ఆమెకు 8 ఏళ్ల వయసప్పుడే రాజమహేంద్రవరం నుంచి అమెరికా వెళ్లారు.