ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్లో ఇద్దరు మహిళా లాయర్లు గొడవకు దిగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన కోర్టు ఆవరణలో జరిగినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో మహిళలు చెంపదెబ్బలు కొట్టుకోవడంతో పాటు, జుట్టు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తోటి పురుష లాయర్లు వారిని విడదీయాలని ప్రయత్నించినా, వారు వెనక్కి తగ్గలేదు. ఈ హై వోల్టేజ్ డ్రామా తర్వాత, లేడీ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గొడవ పడుతున్న ఇద్దరు మహిళా లాయర్లను విడదీశారు. ఈ ఘటన 3 నెలల క్రితం జరిగినది కానీ ప్రస్తుతం మళ్లీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.