పార్వతీపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులుఓ వైపు చలి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో వైపు పొగమంచు కమ్మేస్తూ ఉమ్మడి జిల్లాలోని ప్రజలను ఆసుపత్రులో చేరుతున్నారు . ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. చల్లటిగాలులతో జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం తదితర కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.మంచు ప్రభావంతో చిన్నారులు జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. వృద్ధులు, ఆస్తమా ఉన్నవారుఆయాసంతో ఇబ్బందులు పడుతూ ఆసుపత్రుల్లో కృత్రిమ ఆక్సిజన్ తీసుకుంటున్నారు.జనవరి నెలలో పార్వతీపురంకేంద్రాసుపత్రిలో ఆస్తమా, ఇతర శ్వాస సంబంధ ఇబ్బందులతో చాల మంది చికిత్సపొందుతున్నారు.