పశ్చిమ బెంగాల్ మంత్రి రథిన్ ఘోష్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. ఉత్తర 24 పరగణాస్‌లోని దత్తపుకూర్ ప్రాంతానికి మంత్రి రథిన్ ఘోష్ వచ్చారు. సమస్యల గురించి చెప్పేందుకు స్థానిక యువకుడు సాగర్ బిశ్వాస్ వచ్చాడు. అతడిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. తర్వాత మంత్రి అనుచరులు రెచ్చిపోయి, ఆ యువకుడిని చెప్పుతో కొట్టారు. ఈ వీడియో శనివారం ట్విట్టర్లో వెలుగులోకి వచ్చింది.