ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు ఢీకొని గొర్రెలు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 17, 2023, 10:38 AM

బత్తలపల్లి మండల పరిధిలోని డి. చెర్లోపల్లి గ్రామంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని 59 గొర్రెలు మృతిచెందిన ఘటన బత్త లపల్లి మండలం డి. చెర్లోపల్లి గ్రామ సమీపంలో చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు. ఆదివారం డి. చెర్లోపల్లికి చెందిన యణప్ప, ప్రసాద్ అనే కాపరులు మేపడం కోసం గ్రామ సమీపంలోకి తీసుకుని గ్రామ సమీపంలోకి తీసుకువెళ్లారు.

రైలు పట్టాలు దాటుకొని వెళ్తుండగా అంతలోనే ధర్మవరం వైపు నుంచి తిరుపతి వెళ్తున్న రైలు ఢీకొనడంతో 59 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. నారాయణప్పకు చెందిన 32, ప్రసాద్ కు సంబంధించిన 27 గొర్రెలు మృతిచెందాయి. కొద్దిరోజుల కిందట అప్పు చేసి కొన్నామని, ఇంతలోనే ఘోరం జరిగిందంటూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. రూ. 6 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com