పుట్టగొడుగుల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. శరీరంలో రక్తం తగ్గినా, రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గినా పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకుంటే త్వరలోనే ఫలితం కనిపిస్తుంది. వీటిలో ఉండే ఫోలిక్ యాసిడ్, ఐరన్‌లు మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయులను పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుట్టగొడుగులను ఆయుర్వేదంలోనూ ఉపయోగిస్తారు. శరీరంలో పేరుకుపోయిన అధిక బరువును వదిలించుకోవడానికి పుట్టగొడుగులను తీసుకోవడం మంచిది. పుట్టగొడుగులలోని యాంటీఆక్సిడెంట్, యాంటీబయాటిక్ లక్షణాలు మన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.