శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలోని ఆర్ఎంపి డాక్టర్లపై చర్యలు తీసుకోవాలనిసిపిఎం నాయకులు మంగళవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎటువంటి అవగాహన లేని ఆర్ఎంపీ డాక్టర్లు రోగాలతో వచ్చిన వారికి సూర్య మందులు వేసి అధికంగా డబ్బులు గుంజుకుంటున్నారన్నారు. వీరిపై ఉన్నతాధికారుల చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వైద్యాధికారి రామకృష్ణ కు అందజేశారు.