శ్రీ కృష్ణదేవరాయల పాలన స్ఫూర్తిదాయకమని నరసప్ప , వేదచలం , వెంకటేష్, వెంకటాద్రి , సోము. శ్రీనివాసులు , రామాంజనేయులు , బలిజ కులస్తులు తెలిపారు , మడకశిర పట్టణంలో తేరువీధి శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో శ్రీకృష్ణదేవరాయల 552వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు , మంగళవారం ఉదయం శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు , అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు , ఈ సందర్భంగా. కాపు , బలిజ కులస్తులు మాట్లాడుతూ. రాయల పాలన గురించి వివరించారు. దేశభాషలందు తెలుగు లెస్స అని మన మాతృభాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు అని కీర్తించారు. రత్నాలు రాసులుగా పోసి అమ్మినటువంటి ఘన చరిత్ర కేవలం శ్రీకృష్ణదేవరాయల వారికే దక్కింది. అంతే కాకుండా చెరువులు, కుంటలను తవ్వించడం, గొలుసుకట్టు కాల్వల నిర్మాణం ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించి దక్షిణ భారత దేశంలో కరువు లేకుండా చేసిన గొప్ప రాజు కృష్ణదేవరాయలు అని కొనియాడారు. ఆయన కాలం నాటి దేవాలయాలు, పురాతన కట్టడాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్న దేవాలయాలు. కనుకనే నేటికీ గొప్ప పరిపాలనాధక్షుడిగా ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు, ఈ కార్యక్రమంలో తిమ్మరాజు , శ్రీనివాసులు , మేఘన హోటల్ రమేష్ , రవి , లక్ష్మీపతి. సూరి , తిమ్మరాజు మజ్జిగ వెంకటేష్, నారాయణ , బుజ్జి , బాలాజీ, గోపి , వెంకట్ రాజు , వెంకటేష్, ఉమేష్ , ట్రాక్టర్ దేవా , బలిజ వీర మహిళలు శ్రీదేవి , వరలక్ష్మి , నాగమణి , గంగమ్మ సౌభాగ్య లక్ష్మి రామలక్ష్మమ్మ భాగ్య సిద్ధమ్మ తదితరులు పాల్గొన్నారు,