మహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ కు సుమారు రూ.23 లక్షల బిల్ కట్టకుండా అదృశ్యమయ్యాడు. అబుదాబిలోని రాయల్ కుటుంబంతో లింక్ ఉందని చెప్పి మోసానికి పాల్పడ్డాడు. గతేడాది ఆగస్ట్ 1న హోటల్ లో దిగి నవంబర్ 20న కనిపించకుండా పోయాడు. అంతే కాకుండా హోటల్ రూంలో వెండి వస్తువులు దొంగిలించినట్లు తెలుస్తోంది. సీసీల ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.