శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం శిరివరం గ్రామ పంచాయతీ తిరుమల దేవరపల్లి, గోపిందెవరపల్లి గ్రామాల్లో విచ్చల విడిగా అనధికారికంగా కల్లు విక్రయాలు జరుగుతుంన్నాయి. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా తూతూ మంత్రంగా దారుడు నిర్వహిస్తున్నారు. సోమవారం కూడా పెనుకొండ సెబ్ అధికారులు కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిసింది. అయిన కూడా లేపాక్షి మండలంలోని పలు గ్రామాల్లో విచ్చలవిడిగా కల్లు దుకాణాలు వెలిశాయి. కల్లు దుకాణాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.