చెన్నైకి చెందిన ట్రీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సహకారంతో వేటపాలెం మండలం రామాపురం లో రామాలయం వద్ద మహిళలకి సోమవారం పర్యావరణ పరిరక్షణ , జీవవైవిధ్యం నేపధ్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మొదటి 5 స్థానాల్లో నిలిచిన వారికి నగదు పురస్కారాన్ని , పాల్గొన్న అందరికీ ప్రోత్సాహకాలు అందజేశారు. జీవ వైవిధ్యంని ప్రతిబింబించే చక్కటి ముగ్గుల తో మహిళలు తమ కళ ని ప్రదర్శించారు. కార్యక్రమంలో నేషనల్ గ్రీన్ కోర్ బాపట్ల జిల్లా కో ఆర్డినేటర్ పవని భానుచంద్ర మూర్తి , ట్రీ ఫౌండేషన్ సమన్వయ కర్త శవనం చంద్రారెడ్డి , గ్రామ కాపు ఆవల శ్రీను, ఫౌండేషన్ కార్యకర్తలు లక్ష్మయ్య, జాలయ్య , జయరావు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.