జిరా (ఫిరోజ్పూర్)లోని మన్సూర్వాల్ గ్రామంలో ఉన్న మద్యం తయారీ యూనిట్ వల్ల ఏర్పడే కాలుష్యంపై రైతులు నిరసన వ్యక్తం చేయడంతో, రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ కోసం తక్షణమే అమల్లోకి వచ్చేలా మార్ల్బోరో మద్యం తయారీ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం ప్రకటించారు.ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సిఎం,రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను ఎవరు అతిక్రమించినా కఠినంగా వ్యవహరిస్తామన్నారు.పర్యావరణ నిపుణులు, న్యాయ ప్రముఖులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.