మందులను ఇష్టమొచ్చిన ధరలకు అమ్మకుండా ఉండేందుకు ఎన్ పీపీఏ చర్యలు చేపట్టింది. మొత్తం 128 రకాల ఔషధాల ధరల్ని సవరించింది. వీటిలో పలు యాంటీ బయాటిక్, యాంటీ వైరల్ మందులున్నాయి. సంస్థ నిర్ధేశించిన ప్రకారం సిట్రిజన్ టాబ్లెట్ రూ.1.68లకు, పారాసిటమాల్ రూ.2.76కు, ఐబుప్రొఫెన్ రూ.1.07కు విక్రయించాలి. వీటితో పాటు క్యాన్సర్, షుగర్, బ్రెయిన్ ట్యూమర్ మందుల ధరలు తగ్గనున్నాయి.