ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు సంబంధించి మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఇటీవల కిమ్ తన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని సమాచారం. ఈ క్రమంలో విపరీతంగా మద్యం సేవించడమే కాక తన అనారోగ్య సమస్యలు తలుచుకుని ఏడుస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తన జీవనశైలి, అనారోగ్యం గురించి ప్రపంచానికి వార్తలు లీకవడం కిమ్ కు మరింత ఆందోళన కలిగిస్తోందట.