సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. కేసీఆర్ తో పాటుగా కొందరు జాతీయ నేతలు కూడా స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా ఆలయంలో జరిపే ఆర్జిత సేవలు, నిత్యకల్యాణం కార్యక్రమాలను ఆలయ అధికారులు రద్దు చేశారు. అలాగే బుదవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు నిర్వహించే బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు. ఆలయంలో జరిగే ఆర్జిత సేవలు, నిత్యకల్యాణం కార్యక్రమాలను ఆలయంలో అంతరంగికంగా ఆలయ అధికారులు నిర్వహించారు.