ఢిల్లీ అసెంబ్లీలో బుధవారం ఆప్ రితాలా ఎమ్మెల్యే మహేందర్ గోయల్ రూ.15 లక్షల నోట్ల కట్టలు ప్రదర్శించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దవాఖానాల్లో ఉద్యోగాల భర్తీ.. మాఫియా చేస్తోందని ఆరోపించారు. తాను మాట్లాడకుండా ఉండేందుకు లంచం ఇచ్చారని నోట్ల కట్టలను గాల్లో ఊపారు. దీనిపై సీఎస్ కు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని.. అవినీతిని తరిమేందుకు ఇలా చేశానని చెప్పుకొచ్చారు.