జమ్ముకశ్మీర్ లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. జమ్ముకాశ్మీర్ కాంగ్రెస్ ప్రతినిధి దీపిక పుష్కర్ నాధ్ పార్టీకి రాజీనామా చేశారు. భారత్ జోడో యాత్రలో మాజీ మంత్రి లాల్ సింగ్కు భాగస్వామ్యం కల్పించడంతో తాను కాంగ్రెస్ నుంచి వైదొలగాలనే నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపింది. కథువా లైంగిక దాడి నిందితుడికి లాల్ సింగ్ వెన్నుదన్నుగా నిలిచారని, అలాంటివారితో తాను వేదిక పంచుకోలేనని తెలిపింది.