తనను ప్రేమగా చూసుకోవడం లేదని ఓ మైనర్ కన్నతల్లినే కాల్చి చంపిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని టీకమ్ గఢ్ జిల్లా దేహత్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రమేష్ రజక్ అనే సెక్యూరిటీ గార్డ్ తన భార్య సప్న, ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం 17 ఏళ్ల కుమారుడు తల్లితో గొడవ పడి తండ్రి లైసెన్స్ డ్ రివాల్వర్ తో ఆమెను చంపాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.