మహారాష్ట్రలో కోడిగుడ్ల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి రోజు 2.25 కోట్ల కోడిగుడ్లను తింటుండగా, 1.25 కోట్ల గుడ్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ప్రతిరోజు సుమారు కోటి కోడిగుడ్ల కొరత ఏర్పడుతుంది. ఈ కొరత అధిగమించేందుకు కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుండి గుడ్లను దిగుమతి చేసుకుంటున్నట్లు పశుసంవర్థకశాఖ కమిషనర్ ధనుంజయ పార్కలే తెలిపారు.