నిద్రలో మంచంపై మూత్రం పోశాడని తన ప్రియుడిని ఓ యువతి కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన అమెరికాలోని లూసియానాలో జరిగింది. బాధితుడు, బ్రియానా లాకోస్ట్ అనే యువతి ఏడాదిన్నరగా సహజీవనం చేస్తున్నారు. శనివారం రాత్రి మద్యం మత్తులో అతను పక్క తడపడంతో ఆగ్రహానికి గురైన ఆమె ప్రియుడిపై కత్తితో దాడి చేసింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితురాలిని అరెస్ట్ చేశారు.