తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి రోజు రెండు గ్రూపులుగా మారి ఆయనకు నివాళులు అర్పించారు. ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఏరిక్షన్ బాబు ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే మాజీ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ డాక్టర్ మన్నే రవీంద్ర (అజితరావు) నేతృత్వంలో టిడిపి నాయకులు ఆయన విగ్రహం వద్దకు ర్యాలీ గా చేరుకొని నివాళులు అర్పించారు. పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వారికి కలసి కట్టుగా పనిచేయాలని సూచించారు. వర్ధంతి రోజు కూడా రెండు వర్గాలుగా మారి నివాళులు ఇవ్వడంతో పట్టణంలోని పలువురు టిడిపిలో యూనిటీ లేదని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు.