రోడ్లపై బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.1పై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. జీవో నెం.1పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయగా, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై స్పందించిన సుప్రీంకోర్టు.. రేపు విచారణ చేపడతామని ప్రకటించింది.