రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ వన్ పిరికిపంద చర్యని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం నగరంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వ హయాంలో తాము కూడా జీవో వన్ తీసుకుని వచ్చినట్లయితే ఈరోజు జగన్ అనే వ్యక్తి ఉండేవారా అని ప్రశ్నించారు. టిడిపిది రాజ్యాంగబద్ధమైన పరిపాలనని , వైసీపీది నియంత పాలనని విమర్శించారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని మండిపడ్డారు.