అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామ సచివాలయం పరిధిలో శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శనీయమన్నారు. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలను నిత్యం ప్రజల మధ్యనే ఉండమంటున్నారని ఎమ్మెల్యే చెప్పారు. మంచి జరిగితేనే ఆదరించమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారని ఇలా దమ్ముగా చెప్పిన సీఎం గతంలో ఎవరూ లేరని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.