అరసవల్లి ఆదిత్యుని రథసప్తమి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పేర్కొన్నారు. జనవరి 28 న జరుగునున్న రథసప్తమి వేడుకల ఏర్పాట్లలో భాగంగా అనివేటి మండపంలో కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చేపట్టనున్న ఏర్పాట్లపై కలెక్టర్, రెవెన్యూ , పోలీసు, రవాణా శాఖలకు ఆలయ ఈవో హరి సూర్యప్రకాష్ వివరించారు.