ఉరవకొండ నియోజకవర్గ కేంద్రం శివరామిరెడ్డి కాలనీ నుంచి బాలికల గురుకుల పాఠశాల మీదుగా వైస్సార్ జగనన్న కాలనీ లే అవుట్ వరకు నిర్మించబోయే రోడ్డుకు మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి గురువారం భూమిపూజ చేశారు. నూతన కాలనీ వాసుల విన్నపం మేరకు 29 లక్షల రూపాయల జెడ్పి నిధులతో డబ్ల్యూబియ రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీనికి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి భూమిపూజ చేశారు. రోడ్ల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.