గుంతకల్లు పట్టణంలో యోగవేమన జయంతి కార్యక్రమాన్ని గురువారం ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి ఆధ్వ ర్యంలో నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న యోగి వేమన విగ్రహానికి ఎమ్మెల్యే వెంకట్రా మిరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగి వేమన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా సీఎం జగన్మోహన్ రెడ్డి జిఓ జారీ చేయడం ప్రశంసనీయం అన్నారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, రెడ్డి సంక్షేమసంఘం అధ్య క్షులు అశ్వత్ రెడ్డి, రాష్ట్ర వీరశైవ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు సుంకిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జింకల రామాంజనేయులు, రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.