తన ప్రేమను తిరస్కరించిందని ఓ యువకుడు 15 ఏళ్ల మైనర్ ను నడిరోడ్డుపై తుపాకీతో కాల్చేసిన ఘటన యూపీ బదోహీలో బుధవారం జరిగింది. ఆనంద్ విశ్వకర్మ అనే యువకుడు కొంతకాలంగా అనురాధ బింద్ అనే మైనర్ ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆమె అంగీకరించకపోవడంతో బుధవారం నడిరోడ్డుపై ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.