మహారాష్ట్రలోని రాయగఢ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-గోవా జాతీయ రహదారిపై కారు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. మంగావ్ జిల్లా రెపోలి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది వలసకూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు గాయపడ్డాడు. చిన్నారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa