పింఛనుదారులకు లైఫ్ సర్టిఫికెట్ ఇస్తామని 1,800 మందికి పైగా మోసగించిన నలుగురి సభ్యుల ముఠాను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ప్రభుత్వ వెబ్ సైట్ ను పోలిన నకిలీ వెబ్ సైట్ సృష్టించి జీవన్ ప్రమాణ్ పేరుతో సామాన్యులను మోసం చేశారని పోలీసులు తెలిపారు. ఒక్కో దరఖాస్తుదారుని నుంచి రూ.199 రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకున్నారని వెల్లడించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు.