సంక్రాంతి సంబరాలు ముగియడంతో ప్రజలు స్వగ్రామాల నుంచి మళ్లీ తిరుగు పయనమయ్యారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తూ పండుగ సందర్భంగా అందరూ స్వగ్రామాలకు చేరుకున్నారు. వారు తిరిగి పట్టణాలకు వెళ్లేందుకు రవాణా కష్టాలు తప్పలేదు. దొనకొండకు రోడ్డు మార్గాన రవాణా సౌకర్యం లేకపోవటంతో ప్రజలకు రైలు ప్రయాణం తప్పనిసరి అయింది. దీంతో దొనకొండ మీదుగా ప్రయాణించే పలు రైళ్లు తీవ్ర రద్దీగా నడిచాయి. చదువు నిమిత్తము గుంటూరు విజయవాడ నరసరావుపేట దూర ప్రాంతాలకు విద్యార్థులు చదువుకోడానికి ఇక్కడ నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు.