విశాఖ నగరంలోని యాదవ జగ్గరాజుపేటలో మత్తు ఇంజక్షన్లు గురువారం కలకలం రేపాయి. వ్యర్థాల నిర్వహణ దుకాణంలో మత్తు పదార్ధాలు లభ్యమయ్యాయి. ఒక్కో మత్తు ఇంజక్షన్ 300 రూపాయలకు విక్రయిస్తునట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ గుట్టురట్టు చేసేందుకు పోలీస్ యంత్రాంగం చర్యలు చేపడుతోంది.