ప్రస్తుత రోజుల్లో చాలామంది హైబీపీతో బాధపడుతున్నారు. బ్లడ్ ప్రెజర్ 140/90 దాటితే హైబీపీ అంటారు. ఇది గుండె సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి ప్రమాదాలకు కారణమవుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం ద్వారా హైబీపీ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. తులసి ఆకులను తినడం వల్ల వాటిలో ఉండే ఈజెనాల్ అనే యాంటీఆక్సిడెంట్ రక్త ప్రసరణను అదుపులో ఉంచుతుంది. అలాగే కొత్తిమీర తీసుకోవడం వల్ల హానికరమైన కొవ్వును తగ్గించి గుండె జబ్బులను అడ్డుకుంటుంది. వీటితో పాటు తరచుగా వ్యాయామం చేయడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది.