ఏపీఎన్జీఓ రాష్ట్ర సంఘ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బండి శ్రీనివాసరావు, కేవీ శివారెడ్డి మరోమారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని ఏపీఎన్జీఓ భవన్లో బుధవారం జరిగిన నామినేషన్ల కార్యక్రమంలో బండి, శివారెడ్డిల ప్యానెల్ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారి రాష్ట్ట్ర సంఘం ఎన్నికలు ఏకగ్రీవమైనట్టు ప్రకటించారు. మొత్తం 20 మందితో నూతన కార్యవర్గ కమిటీ ఎన్నికైంది.