రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు బస్సు యాత్ర చేపడుతున్నట్లు ఏఐఎస్ఎఫ్ కర్నూలు జిల్లా కార్యదర్శి షాబీర్ బాషా, పీడీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు కోరారు. బుధవారం బీమాస్ హాల్లో బస్సు యాత్ర గోడపత్రికలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... ఈ నెల 20న హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సు యాత్ర ప్రారంభం కానుందన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. గిరిజన సెంట్రల్ మైనింగ్ యూనివర్సిటీ అభివృద్దికి నిధులు విడుదల చేయాలన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు అఖండ, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ రమేష్, దస్తగిరి, మల్లికార్జున, గణేష్, నాగరాజు, మల్లి, ఆనంద్ పాల్గొన్నారు.