జీలకర్రలో చాలా ఔషధ గుణాలున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జీలకర్రను వంటల్లోనే కాకుండా మామూలుగా తీసుకుంటే కడుపు నొప్పి, విరేచనాలు, నెలసరి సమస్యలు వంటి రుగ్మతలు తొలగుతాయని చెబుతున్నారు. అంతే కాకుండా ఇమ్యూనిటీ పెంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు. సక్రమ జీర్ణక్రియకు, కిడ్నీలో రాళ్ల సమస్యలు సైతం జీలకర్రతో సమసిపోతాయంటున్నారు.