కెనరా బ్యాంక్ కొత్తగా 7.7 శాతం వరకూ వార్షిక వడ్డీ రేటు ఆఫర్ తో 400 రోజుల ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది. ఇందులో నాన్ కాలబుల్ డిపాజిట్ (గడువుకు ముందే తీసుకోలేనివి)పై 7.25 శాతం, కాలబుల్ డిపాజిట్ (గడువుకు ముందే తీసుకునేవి) పై 7.15 శాతం వార్షిక వడ్డీ రేటు ఇస్తున్నట్లు తెలిపింది. కాగా, 60 ఏళ్లు నిండిన వారికి 0.50 శాతం అదనపు రేటును ఇస్తోంది.